ప్రజావాణికి 53 దరఖాస్తులు

ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

….అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి ,  ఆగస్టు 28  :::::

ప్రజావాణిలో అందిన ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

డి ఆర్ ఓ నగేష్ తో కలిసి జిల్లా నలు మూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి  లో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని సూచించారు.  తిరస్కరించిన వాటికి సవివరమైన వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు.

ప్రజావాణిలో మొత్తం ( 53  ) దరఖాస్తులు రాగా, అందులో ( 18 ) రెవెన్యూ సంబంధిత సమస్యలు కాగా, (   35  ) పంచాయతీ, బిసి, ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ, సివిల్ సప్లై, వ్యవసాయ, ఉపాధి, వైద్య ఆరోగ్య తదితర శాఖలకు చెందినవి ఉన్నాయి.

ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్. ఓ. నగేష్,

వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.