రామగిరి మండల ఇంచార్జీ గా ఎడ్ల సదాశివ్
నియామకం – జిల్లా అధికార ప్రతినిధి పోతరవేని క్రాంతి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం భారతీయ జనతా పార్టీ ఇంచార్జీగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ ఎడ్ల సదాశివ ను నియమించినట్లు పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతార వేణి క్రాంతి తెలిపారు. ఈ నియామకానికి సహకరించిన సునీల్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ కి పెద్దపల్లి జిల్లా బిజెపి ఇన్చార్జ్ రావుల రామనాధ్ కి, కన్వీనర్ కో కన్వీనర్ , అధికార ప్రతినిధి లకు నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు సునీల్ రెడ్డి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని వారు తెలిపారు.