ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చేయాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ రూరల్ జూలై 10 జనం సాక్షి
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 262 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారని వారి నమ్మకానికి వమ్ము చేయకుండా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.