ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదనపు కలెక్టర్ లింగ నాయక్
వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి
.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారుసోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 116 ఫిర్యాదులను జీ. యం. ఇండస్ట్రీస్ వినయ్ కుమార్, తహసీల్దార్ కిరణ్ కుమార్ లతో కలసి అదనపు కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కొసం దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చిన ఫిర్యాదులను అర్హతల మేరకు వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.