ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించారు
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 5 ( జనం సాక్షి);
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో (55) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అట్టి సమాచారాన్ని దరఖాస్తుదారులకు వివరంగా తెలియపరచాలన్నారు. ప్రజావాణి ద్వారా మరింత వేగంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్య లు, ఆసరా పెన్షన్, వికలాంగుల ట్రై సైకిల్ తదితర అంశాలపై దరఖాస్తు లు వచ్చాయని తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు అందరు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ కలెక్టరేట్ ఎ ఓ యాదగిరి, జిల్లా అధికారులు సంబంధిత శాఖలు తదితరులు పాల్గొన్నారు
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించారు




