చిన్నారి సహస్రకు అండగా నిలిచిన మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్
మోత్కూర్ డిసెంబర్ 5 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రానికి చెందిన బత్తిని పరశురాములు కుమార్తె చిన్నారి సహస్ర అనారోగ్యంతో హైదరాబాదులోని ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుండగా, మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ దాతలు, సభ్యులు ఆపద సమయంలో అండగా నిలిచారు. ఈ సందర్భంగా దాతలు అందించిన రూ 46,366 నగదును చిన్నారి సహస్ర తండ్రి పరశురాములకు సోమవారం స్వయంగా అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే తక్షణసాయంగా రూ.25000 అందించారు .ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలుస్తూ ప్రాణాలను కాపాడుతున్న మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ ఆర్థిక సహాయాల అందజేతలో జిల్లాలోనే ముందంజలో నిలవడం అభినందనీయమని, వాట్సాప్ గ్రూప్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్ గుండగోని రామచంద్రు గౌడ్ అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రూప్ ప్రతినిధులు దబ్బేటి సోంబాబు ,గంధం శ్రీనివాసరావు ,కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కోమటి మచ్చగిరి ,మర్రి అనిల్ కుమార్, జంపాల రాజు ,చల్లా వెంకటరెడ్డి ,తమ్మినేని శ్రీనివాసరావు, మర్రి ఆనందం, నల్ల మధు, సజ్జనం పాండు తదితరులు పాల్గొన్నారు.




