Tuesday, 3 November 2026

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించండి. కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్లబ్యూరో. జులై 3. (జనంసాక్షి) ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ నిర్వహించిన ప్రజలను దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజే యాలన్నారు.కార్యక్రమంలో వేములవాడ ఆర్డిఓ పవన్ కుమార్ , జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.