Wednesday, 4 November 2026

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటివరకు 90,329 ఫిర్యాదులు అందగా ఇందులో 88,768 ఫిర్యాదులు పరిష్కరించినట్లు, 1561 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 264 ఫిర్యాదులు వివిధ శాఖల వద్ద నెల రోజులు పైబడి పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు అశ్రద్ధ చేయకుండా సత్వరం పరిష్కరించాలని, అలాగే నెల రోజులకు మించి ఎట్టి పరిస్థితిలో పెండింగ్‌లో ఉంచరాదని ఆయన ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *