Wednesday, 4 November 2026

సత్వరం సమస్యల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్‌, నవంబర్‌ 5 :  ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించి ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులను సమావేశపరిచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. సుల్తానాబాద్‌ మండలం ఎలిగేడు గ్రామంలో రహదారిపై బావి తవ్వుతున్నారని దీనిపై చర్య తీసుకోవాలని కోరగా జేసీ స్పందిస్తూ పంచాయితీ ఈ.ఓ. ద్వారా పరిశీలించి చర్య తీసుకుంటామన్నారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామంలోని చెరువుకు గండిపడి నీరు లీకేజీ అవుతోందని దీనిపై చర్య తీసుకోవాలని కోరగా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించి చర్య తీసుకోవాలని జేసీ ఆదేశించారు. మానుకొండూర్‌ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ గ్రామంలోని ఉషోదయ స్వయం సహాయక మహిళా సంఘానికి పావలా వడ్డీ బకాయిలు పంపిణీ కాలేదని తెలుపగా జేసీ స్పందిస్తూ వెంటనే పావలా వడ్డీ బకాయి పంపిణీ చేయాలని ఐ.కె.పి. అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి 8మంది ఫోన్‌ ద్వారా తమ సమస్యలను తెలుపగా సంబంధిత అధికారులకు జేసీ పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాశంలో అదనపు జేసీ సుందర్‌ అబ్నార్‌, డీఆర్‌ఓజే సుధాకర్‌ రావు, జడ్పీసీఈఓ చక్రధరరావు, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *