Wednesday, 4 November 2026

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

– ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారనడానికి ఇదే నిదర్శనం
– రాహుల్ గాంధీకి అండగా యావత్ భారత దేశం నిలుస్తోంది
– బీ.జే.పీ ప్రభుత్వ వైఫల్యం పై ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు
– కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన
హుజూర్ నగర్ మార్చి 25 (జనంసాక్షి): ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక ఇందిరా సెంటర్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పిసిసి అధికార ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కష్టాల శ్రవణ్ కుమార్, ఎక్స్ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు బాచి మంచి గిరిబాబు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కడుపు మహేష్ గాడ్, మండల అధ్యక్షులు సుబ్బారావు, అంకతి సత్యనారాయణ లు మాట్లాడుతూ
అధికారం కోసం కులాల పేరిట, మతాల పేరిట చీల్చాలని బిజెపి పార్టీ ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు భారత జో డో యాత్ర చేపట్టారన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ ని విదేశాల నుంచి వెనక్కి రప్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని పార్లమెంట్ లో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారన్నారని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వ్యక్తిగత కక్షలతో ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారో చెప్పడానికి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు నిదర్శనం అన్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితులు నీరువు మోడీ, లలిత్ మోడీ లను వెనక్కి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు అండగా నిలుస్తున్నారనే భావన వచ్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని రద్దు చేయడమని విమర్శించారు.
భారతదేశంలో కేరళలోని వాయినాడు నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీ 12 లక్షల 76,945 ఓట్లతో గెలుపొందారని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీకి యావత్ భారతదేశం అండగా నిలుస్తుంది అన్నారు. యూపీఏ పాలనలో నిరుపేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపేందుకు ఎన్.ఆర్.ఈ.జీఎస్ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ,పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు మద్దతు ధర ప్రకటించడంతోపాటు అమలు చేసేందుకు fci కి అండగా నిలిచేలా బలోపేతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. యూపీఏ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 కు పెరిగిన పెంపు భారం సామాన్య ప్రజలపై పడనీయకుండ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భరించిందన్నారు.
దేశంలోని రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గు గనులు. ఒక వ్యక్తి చేతిలో ఒకే వ్యక్తి వ్యాపారం కిందికి మార్పిడి చేస్తూ దేశ సంపద కొల్లగొడుతుండడాన్ని ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. దేశ సంపదను అదానీ కొల్లగొడుతుంటే వాస్తవాలు వెలికి తీసేందుకు జేపీసీ నియామకం చేపట్టాలని ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చిన స్పందన కరువైందన్నారు. నీతి, నిజాయితీకి నిరాడంబరతకు నిదర్శనం రాహుల్ గాంధీ ఆయన వెంట దేశ ప్రజలు ఉన్నారనీ అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు చేయడం ప్రజాస్వామ్యనికే చీకటి రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ తేజావత్తు రాజా నాయక్, కోతి సంపత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జుట్టు కొండ సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య, intuc నాయకులు బెల్లంకొండ గురువయ్య, మేళ్లచెరువు ముక్కంటి, పోతనబోయిన రామ్మూర్తి, చింతకాయల రాము, కాంగ్రెస్ బూత కమిటీ అధ్యక్షులు, వెలిదండ వీరారెడ్డి, కోళ్ల పూడి, యోహాన్, సులువా చంద్రశేఖర్, కోడి ఉపేందర్, సమ్మెట సుబ్బరాజు, అజ్మతుల్లా, సత్యనారాయణ, మోదాల సైదులు, లచ్చిమల్ల నాగేశ్వరరావు, నందిగామ శ్రీనివాస్, బుల్లెద్దు కార్తీకు, దొంతగాని జగన్, షేక్ ఉద్దండు, సంక్రాంతి కోటేశ్వరరావు, పులిచింతల అంజిరెడ్డి, పుట్ట గోవింద్, కుందూరి శ్రీనివాస్ రెడ్డి, రెక్కల ఆది రెడ్డి, రవి, తెప్పని ఎలమంద, యూత్ కాంగ్రెస్ శ్రేణులు కందుల వినయ్, పులి బాలకృష్ణ, కస్తాల రవీందర్, రెడిపంగు రాము, బచ్చలకూరి కృష్ణ, కందుకూరి రాము, పానుగోతు శివ సంజయ్ నాయక్, నర్సింగ్ ఉపేందర్, ఐలవీర కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.