హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ నుంచి తెలంగాణ సభ్యులను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్ర.లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి సీమాంధ్ర సర్కారు కింఛపరిచింది. ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసిందని విమర్శించారు. తెలంగాణపై మాట్లాడకుండా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నోరు నొక్కారని ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని వారిని అగౌరవ పరచడమేనని తెలిపారు. మేమేం పాపం చేశామని మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారని ఆయన ప్రశ్నించారు.




