Wednesday, 4 November 2026

మంత్రి కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రాయపాటి

గుంటూరు,(జనంసాక్షి): మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ గుమాస్తాగా పనిచేయలేదని, పుట్టుకతోనే కోటీశ్వరుడినన్నారు. వందల కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని చెప్పారు. రేకులషెడ్లలో ప్రస్థానం ప్రారంభించిన కన్నా కోట్ల రూపాయల ఆస్తుల ఎలా కూడబెట్టాడు? అని ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని జనం ఓట్లు వేసినంతకాలం కన్నా లాంటివాళ్లే నేతలవుతారని చెప్పారు. కాపులకు మంత్రి కన్నా ఏమీ చేశారు? అని అడిగారు. అవినీతి మంత్రి కన్నాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *