Wednesday, 4 November 2026

టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం

విజయవాడ : బందరురోడ్డులోని టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల రూపాయల విలువైన టైర్లు , ట్యూబులు కాలిబూడదయ్యాయి. ఓ ట్యూబుకు పంచర్‌వేసేందుకు ఏర్పాటు చేసిన పొయ్యి నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న ట్యూబులు, టైర్లు తగలబడ్డాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *