విశాఖపట్నం : విశాఖ ఉక్కు కర్మాగారం ధర్మల్ పవర్‌ప్లాంట్ విభాగంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ పై నుంచి కిందపడి ఒప్పందకార్మికుడు గంగాధర్ మృతి చెందాడు. ఉక్కు కర్మాగారం కోకోవెస్ విభాగంలోని సీడీసీసీలో గ్యాస్ లీకై పలువురు కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం తెలిసింది.




