మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 10,జనంసాక్షి :భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో 18 వ వార్డు లో శక్తి కేంద్రం ఇంచార్జ్ తోకల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల కోసం 18 గంటల శ్రమిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి మచ్చలేని అవినీతి రహిత పాలన అందిస్తున్నారని గ్రామపంచాయతీలు స్థానిక సంస్థలు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు సీసీ రోడ్లు రైతు నివేదికలు వైకుంఠధామాలు లాంటి అభివృద్ధి పనులను కేంద్రం నిధుల వల్లే ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కరోనా విపత్తు సమయాల్లో పేదలు ఎవరు ఆకలితో అలమట్టించోద్దని మూడేళ్లుగా పేదలకు ఉచిత రేషన్ బియ్యాన్ని ప్రతి వ్యక్తికి ఐదు కిలోలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రామగుండం ఎన్టిపిసి ద్వారా 8500 కోట్లతో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేశారు ప్రజా వైద్యం కోసం బీబీనగర్ లో ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించారు పల్లె నుంచి పట్నానికి అక్కడి నుండి రాష్ట్రాలకు అనుసంధానం చేసే లింకు రోడ్డును మంజూరు చేసిన ఘనత బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదే, సికింద్రాబాద్ విశాఖపట్నం వందేమాతరం రైలు ప్రారంభించడం కావడంతో వేలాది మంది ప్రయాణికులకు తక్కువ సమయంలో తమ గమ్యానికి చేరుకునే అవకాశం లభించింది తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరాశ అవినీతి కుటుంబ పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులుస్తున్నప్పటికీ ఏమి ఇవ్వడం లేదని ప్రజల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేస్తూ స్వార్థపూరిత రాజకీయాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి వాగ్దానం చేసి యువతకు అన్యాయం చేస్తున్నారు, 317 జీవో తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్ పథకం పేద ప్రజలకు అందకుండా చేస్తున్నారు రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా గ్రానైట్ మాఫియా లిక్కర్ మాఫియా లాంటి అన్నిట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నాయకులు ప్రత్యక్ష ప్రమేయం ఉంది ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ ఆగడాలు నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు చేస్తున్న దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగాడుతున్నారు ఉద్యోగుల కోసం నిరుద్యోగ దీక్ష రైతు కోసం రైతు దీక్ష 315 జీవ సవరణ కోసం జైలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఇంటర్ విద్యార్థుల తరపున పోరాటం వరి ధాన్యం కొనుగోలు కోసం ఐకెపి సెంటర్ల సందర్శన ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ప్రత్యక్ష ఉద్యోగం చేసింది 22 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో బిజెపి రాజీలేని పోరాటం చేసింది ఇలా ప్రజల కోసం ఉద్యమిస్తే బిజెపి శ్రేణులైన యువమోర్చా ఎస్సీ మోర్చా మహిళా మోర్చా ఓ బి సి మోర్చా నాయకులపై పోలీసులతో దాడి చేయించి ఆసుపత్రి పాలు చేస్తున్నారు అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబారి ప్రభాకర్ బిజెపిపట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ కోరుట్ల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చెట్ల పెళ్లి సుఖేందర్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లేందుల శ్రీనివాస్ పార్లమెంట్ కోకన్వీనర్ గుంటుక సదాశివం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోనికేల నవీన్ కోరుట్లనియోజకవర్గ నాయకురాలు నాయకులు సునీత వెంకట్ సురభి నవీన్ కుమార్ పుదరి అరుణ జిల్లా నాయకుడు యాదగిరిబాబు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెట్లపల్లి మీనా కౌన్సిలర్లు మర్రి పోచయ్య జక్కని సుజాత . మండల అధ్యక్షులు కొమ్మల రాజ్ పాల్ రెడ్డి ముద్ధం సత్యనారాయణ గౌడ్ బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గంప శీను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకెటి విజయ్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ బీజేయం జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్ బోడ్ల గౌతం బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ బిజెపి నాయకులు కొల్లేపు శ్రీనివాస్ మద్దెల లావణ్య వరలక్ష్మి పుల్ల సౌజన్య సునంద రాజ రెడ్డి సుంకే అశోక్ కొయ్య ల లక్ష్మణ్ అనిల్ గౌడ్ లోలాపు అనిల్,ఎలిమి ప్రదీప్ నవీన్ పాల్గొన్నారు




