హుజూర్ నగర్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి): పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి వారి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగియడంతో శుక్రవారం ఆలయ ప్రాంగణంలో హుండీ లెక్కింపు అధికారి కె వి చలపతిరావు, ఈ.వో గుజ్జుల కొండారెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. టెంకాయలు వేలం ద్వారా 27,000/- తై బజార్ వేలం ద్వారా 28,500/- స్థానిక దేవాలయంలో, గట్టు వద్ద ఏర్పాటు చేసిన నాలుగు హుండీల ద్వారా 75,236/- రూపాయలు దేవస్థానానికి ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 26,937 రూపాయలు అధికంగా వచ్చినాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి సమితి సభ్యులు గుండా రమేష్, కోటా సూర్యప్రకాశరావు, పోనుగుపాటి అశోక్, స్థానా చార్యులు జగన్నాథచార్యులు, దామోదరచార్యులు, వెంకట నరసింహాచార్యులు, అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, దేవాలయ సిబ్బంది హనుమంతరావు పాల్గొన్నారు.




