Wednesday, 4 November 2026

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

వేమనపల్లి నవంబర్ 7 జనం సాక్షి

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా పంచాయతీ అధికారి/మండల ప్రత్యేక అధికారి వి నారాయణరావు అధికారులకు సూచించారు.ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా పంచాయతీ అధికారికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.ఇందులో ప్రధానంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని అన్నారు.ఈ సందర్భంగా డిపిఓ నారాయణరావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్య గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య,ఎంపీఓ శ్రీపతి బాపురావు,ఏపిఎం ఉమారాణి,మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.