Wednesday, 4 November 2026

ప్రజా వేదిక లో అధికారులకు నిరసన సెగ.

ప్రజా వేదిక లో అధికారులకు నిరసన సెగ.

ప్రజవేధిక రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్.

జనం సాక్షి ఉట్నూర్.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తనిఖీ నిర్వహిస్తున్న బృందం సోమవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహించడం జరిగింది.ఈ ప్రజా వేదికను రద్దు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా వేదిక ఎదుట నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యూసఫ్ ఖాన్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క తనిఖీ 23 గ్రామ పంచాయతీ లో 15రోజులో ఎలా పూర్తయిందని అవినీతి పరంగా తనిఖీలు నిర్వహించారని మండిపడ్డారు.ముందుగా ప్రతి గ్రామ పంచాయతీ లో గ్రామ సభ నిర్వహింన తర్వాత మండల కేంద్రంలో ప్రజా వేదిక నిర్వహించాలని డిఆర్డిఏ పిడి ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి అనంతరం నార్నూర్ మండలంలో ప్రజావేదిక నిర్వహించాలని అధికారులను నిలదీస్తూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాదవ్ కైలాష్ నాయక్ ఆడే మాణిక్ రావు ఎంపిటిసి తనయుడు కరీం ఖాన్ బీసీ సెల్ రమేష్ నసీర్ షేక్ రాథోడ్ కార్తీక్ మైనార్టీ సెల్ షాకిబ్ ఖాన్ మోతిలాల్ నాయక్ ఎస్టీ సెల్ తుడసం విష్ణు విలాస్ జాదవ్ సుభాష్ ఆడే నాయకులు అధికారులు ఉన్నారు.