Wednesday, 4 November 2026

సొసైటీని సందర్శించిన సహకార శాఖ అధికారులు

సొసైటీని సందర్శించిన సహకార శాఖ అధికారులు

జనం సాక్షి,చెన్నారావుపేట

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను సహకార శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. జిల్లా సహకార శాఖ అధికారి వరంగల్ ఆదేశాల మేరకు నెక్కొండ, నర్సంపేట,వరంగల్ జిల్లా సహకార శాఖ నోడల్ అధికారులు కీరు నాయక్, శ్రీనివాస్ రావు,నాగనారాయణలు సొసైటీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సొసైటీలో జరిగిన లావాదేవీలు,రుణమాఫీ 2018 కి సంబంధించిన అంశాల పై పరిశీలించి సంఘ సీఈవో చిట్టె రవికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే రుణమాఫీ 2018 కి సంబంధించిన వాటి పై తగిన చర్యలు తీసుకొనుటకు సూచిస్తూ వాటి పై తగు ఆధారాలతో సంబధిత రికార్డులను సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.