Tuesday, 3 November 2026

ప్రజా సమస్యలు చర్చకు ..రాకుండా సమావేశం ముగింపు

ప్రజా సమస్యలు చర్చకు ..రాకుండా సమావేశం ముగింపు
బిజెపి కౌన్సిల్ ఫ్లోర్ బోల్గం నాగరజు
జనం సాక్షి (సిరిసిల్ల టౌన్) శనివారం రోజు మున్సిపల్ లో నిర్వహించిన సాధారణ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే 24 అంశాలను 40 నిమిషాల్లో ముగించి ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు పాత టిఆర్ఎస్ కొత్త బిఆర్ఎస్ సభ్యుల ఫోరం ఉందని ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండానే అన్ని తీర్మానాలు చేశారని అన్నారు విలీన గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని చర్చించే అవకాశం కల్పించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై బిజెపి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ బొల్గం నాగరాజు మండిపడ్డారు వెళ్లిన గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని కమిషనర్ లెటర్ పంపడంపై కమిషనర్ ప్రశ్నించగా గతంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి పంపించిన లెటర్ ను తనకు ఇచ్చాడని ఇందులోని సర్వే నెంబర్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపన్నట్టుగా లెటర్ పంపినట్లు తెలిపారని బోల్గాo నాగరాజు పేర్కొన్నారు