కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన దేవరుప్పుల పోలీసులు..
దేవరుప్పుల, డిసెంబర్ 31(జనం సాక్షి):తెలంగాణ ప్రభుత్వము పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చేసిన తప్పులకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ప్రగతిభవన్ ముట్టడికార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 4.00 గంటలకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ అయిన వాళ్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోనగిరి యకస్వామి,కామారెడ్డి గూడెం ఎంపీటీసీ ఎం.డీ జాకిర్,దేవరుప్పుల మండల మాజీ అధ్యక్షులు సురేష్ బాబు,దేవరుప్పుల గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పుల ఉప్పలయ్య,భూక్య మల్లేష్, కామారెడ్డి గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు పులి పంపుల భాస్కర్,యూత్ నాయకులు ఉప్పుల ప్రకాష్, కొంగరి ఉమేష్, చింత శ్రీకాంత్, తోటకూరి వెంకన్న, రెడ్డి రాజుల సంతోష్,తదితరులు ఉన్నారు.




