Wednesday, 4 November 2026

ప్రజా సమస్యలు పట్టించుకోని పాలకులు.

 

 

 

 

 

 

 

– స్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురైన వారికి వంత పాడుతున్న పాలకులు…

– పల్లె నిద్ర కార్యక్రమంలో గొంగళ్ల రంజిత్ కుమార్..

 

గద్వాల నడిగడ్డ మార్చి 11(జనంసాక్షి):- నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిన్న రాత్రి ధరూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గోంగళ్ల రంజిత్ కుమార్ బస చేసి ఉదయాన్నే గ్రామంలో తిరుగుతూ పలు సమస్యలు తెలుసుకున్నారు…ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలు తెలియజేస్తూ…..ఎన్నికలప్పుడు రెండు వర్గాలు గ్రామానికి స్మశానం కోసం ఇస్తామన్న నాలుగు ఎకరాల పొలాన్ని ఒక వర్గం వారు రెండు ఎకరాలు ఇవ్వగా, మరొక వర్గం వారు ఆ స్థలంలో శవాలను పూడ్చనీయకుండా అడ్డుకుంటున్నారని, అలాగే స్మశానానికి వెళ్లే దారి అక్రమణ కు గురైన పాలకులు వారికి అంత పాడుతున్నారని,స్మశానికి ఇచ్చినటువంటి స్థలం గ్రామ పంచాయతీ పేరిట కాకుండా వాళ్ల పేరునే పెట్టుకుని రైతుబంధు డబ్బులు తీసుకుంటున్నారని, అలాగే ఒక రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారి మట్టి రోడ్డు వల్ల ఇండ్లు దుమ్ము దూలీలతో నిండిపోయి తినే తిండి సైతం కలుషితమై అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు..అలాగే పాతగేరి లో డ్రైనేజీ నీరు ఒకచోట చేరి స్టోరేజ్ అవ్వడం వల్ల దుర్వాసనతో దోమలు ఈగల వల్ల రోగాల బారిన పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ట్రాన్స్ఫర్ కు చుట్టూ రక్షణ వలయం లేకపోవడం వల్ల ప్రమాద భరితంగా ఉన్నదని, అలాగే చాలా వీధులలో డ్రైనేజ్ వ్యవస్థ లేక మురుగునీరు ఇళ్ళ ముందరనే ఆగుతున్నదని, చాలా వీధులలో మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్గంధ భరితమవుతున్నదని ఈ సందర్భంగా ప్రజలు గొంగళ్ల రంజిత్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు..ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ వెంటనే ఈ సమస్యలను తీర్చకపోతే, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడమే గాక నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజలను సంఘటితం చేసి పోరాడుతామని అన్నారు..ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకులు అడవి ఆంజనేయులు కృష్ణ,జగదీష్,దరెప్ప, నరసింహులు,వెంకటేశ్, రామాంజనేయులు,చిన్న సవారి,సవారప్ప లతో పాటు..
నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు నాయకులు,రంగస్వామి, పరశురాముడు, ప్రేమ్ రాజ్ పశుల నరసింహులు, సుదర్శన్, తిరుమలేష్,దరెప్ప ఊరబాయి రాములు, తదితరులు పాల్గొన్నారు.