కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 11 :- రెవెన్యూ కార్యాలయం ముందు జవహర్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మొన్నటి వరకు సిమెంటు రేకులతో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేసి ప్రభుత్వ స్థలంలో పాగా వేసి నేడు ఏకంగా పెద్ద ఇల్లు నిర్మాణమే చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటీ …? గతంలో తహసిల్దార్ నాగమణి ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఈ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేసేందుకు సాహసిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే నేడు కోట్ల విలువచేసే ఈ ప్రభుత్వ స్థలంలో తెరచాటుగా ఏకంగా పెద్ద ఇల్లు నిర్మాణం చేపడుతుంటే ప్రభుత్వ భూములను పరిరక్షించెందుకోసమే విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులు ఈ నిర్మాణం విషయం తెలియదు అన్నట్లు వ్యవహరించడం పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి




