Wednesday, 4 November 2026

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే కార్యాలయాలు ముట్టడిస్తాం.

మల్కాజిగిరి.జనంసాక్షి.మే23.నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే సంబంధిత కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. హాత్ సే హాత్ జోడయాత్ర 54 రోజుల ముగింపు సందర్భంగా లక్ష్మీ సాయి గార్డెన్ లో మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నంది కంటి శ్రీధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలో 54 రోజుల పాదయాత్రలో ఎన్నో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారి పార్టీ నాయకుల ఒత్తిడిలతో సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు.రెండో విడత పాదయాత్రలో గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అధికార పార్టీ నాయకులు కేసులు పెడుతున్నారని కేసులకు భయపడవద్దు నేను అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా కల్పించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీకి కష్ట పడి పని చేసిన నాయకులను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.