జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం నిర్వహించారు. నాలుగు సంవత్సరాలుగా ప్రొఫెషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులరైజ్ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రికి పంచాయతీ కార్యదర్శులు మహేష్ నాయక్ అరుంధతి మమత స్వాతి ప్రియ ప్రియాంక సదాశివుడు ప్రవీణ్ సౌజన్య సంధ్య నాగారత్నం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
ముఖ్యమంత్రి చిత్రపటానికి పంచాయతీ కార్యదర్శులు క్షీరాభిషేకం




