ప్రజా సేవకు పట్టం కడుతున్న గ్రామస్థులు..

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్‌ గ్రామస్తులు ప్రజా సేవకులు అయినా బలరాం జాదవ్ కు బోథ్ నియోజక వర్గం లోని పలు గ్రామాల ప్రజలు యువకులు అయన సేవలను గుర్తించి గ్రామాలకు రావాలని ఆయనకు  ఆహ్వానం పలుకుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం మన్నూరు గ్రామస్తులు ఆహ్వానం మేరకు  తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ ఆ గ్రామానికి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళిన తను శివాజి విగ్రహానికి టెంకాయ కొట్టి రామ భక్తులైన  ఆంజనేయ స్వామిని, శబరిమాతను దర్శించుకున్నాడు. యువకులు గ్రామ పెద్దలు తన చుట్టూ చేరి తమ కుటుంబ వ్యక్తిలా భావించి ఎంతో అభిమానంతో వారి సమస్యలను పంచుకున్నారు. మీ గ్రామం ఇచ్చోడ మండలంలోనే ప్రఖ్యాతి గాంచినదని ఐక్యతతో ముందుకు సాగుతు అభివృద్ధి అడుగుల వేస్తుందని అన్నారు. ఈ గ్రామం అందరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. నామీద భరోసాతో పిలిచి సన్మానించినందుకు గాను కృతజ్ఞుడనని అన్నారు. మీ కోసం మీ ఊరి కోసం ఎల్లవేళలా ముందుంటానని హామి ఇచ్చారు. పిలిచిన వెంటనే మా గ్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.బలరాంతో పాటు అమ్టే,రమేష్,పోశేట్టి,యువకులు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.