Thursday, 5 November 2026

ప్రతిభ కనబరిచిన స్లేట్ విద్యార్థులు

.

ప్రతిభ కనబరిచిన స్లేట్ విద్యార్థులు

జన్నారం మండలం మంచిర్యాల జిల్లా(జనం సాక్షి)

2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన కళోత్సవ్-2022 to కార్యక్రమంలో స్లేట్ హై స్కూల్, జన్నారం కి చెందిన అల్లం సాయి వివేక్, 10 వ తరగతి విద్యార్థికి పియానో (Musical Instruments) లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి స్టేట్ లెవెల్ కాంపిటేషన్ కి అర్హత సాధించాడు. అలాగే కామెర శ్రీ హర్షిణి, 10 వ తరగతి విద్యార్థి ఏక పాత్రాభినయం (Mono Action) పోటీలలో జిల్లా రెండవ స్థానంలో నిలిచారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిలిచిన విద్యార్థులను వెంకటేశ్వర్లు, D.E.O, మంచిర్యాల్ గారు, స్లేట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి గారు, వైస్ ప్రిన్సిపాల్ జోబిన్ గారు, పియానో ట్రైనర్ జెబిన్ డానియో, డ్యాన్స్ మాస్టర్స్ నర్మద, పవన్ మరియు ఉపాద్యాయుల బృందం అభినందించడం జరిగింది.