Thursday, 5 November 2026

ఉడికి ఉడకని అన్నం నీళ్ల చారు ఎనగండ్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన

ఉడికి ఉడకని అన్నం నీళ్ల చారు ఎనగండ్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన…!!

అధికారుల పర్యవేక్షణ లోపం..!!

 

జనం సాక్షి కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కుళ్ళిపోయిన కూరగాయలను తీసుకువచ్చి ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని తద్వారా విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ప్రతిరోజు భోజనం చేయలేక కొంతమంది విద్యార్థులు ఇంటి నుండే భోజనం తీసుకువస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు