Wednesday, 4 November 2026

ప్రతిమ ఫౌండేషన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

 

యువ నాయకుడు రాపర్తి అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో

వీణవంక జనవరి 24 (జనం సాక్షి) వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు పోతిరెడ్డిపేట యువ నాయకుడు రాపర్తి అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి చెందిన గ్రామస్తులకు 500 మందికి పైగా అన్ని రకాల వ్యాధులకు చూడడం జరిగింది కొంతమందికి మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగింది కొంతమందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది తర్వాత కొంతమంది పేషెంట్లకు ఉచితంగా సర్జరీ అవసరం ఉందని డాక్టర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల అనుష సతీష్ గౌడ్ ఎంపిటిసి రామచందర్.వార్డ్ మెంబర్ బిక్షపతి. ఆశ రమేష్. మరియు రాపర్తి శ్రీనివాస్. రవి. జాన అరవింద్.రాపర్తి సాయి. సాయి తేజ. మధుకర్.అనిల్. కొలిశెట్టి మొండయ్య నాగర్జున. మరియు ప్రతిమ హాస్పిటల్ డాక్టర్లు మార్కెటింగ్ మేనేజర్ రాజేందర్. జాకీర్. ప్రతిమ ఫౌండేషన్. జి వీరస్వామి. జి కీర్తి. తో పాటు గ్రామస్తులు తో పాటు ఇతరులు పాల్గొన్నారు