గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (24): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు బాలురు తో పాటు అన్ని రంగాల్లో పోటీపడాలన్నారు ప్రభుత్వాలు ప్రత్యేకంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తుందన్నారు చదువులో బాలికలు ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ దీప్తి, కరాటే మాస్టర్ సురేందర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు




