ప్రతి ఇంటికీ తపాలా ఖాతా ఉండాలి
పెనుబల్లి, డిసెంబర్ 15(జనం సాక్షి)
ప్రతి ఇంటికి తపాలా ఖాతా ఉండాలనే లక్ష్యంతో సత్తుపల్లి పోస్టల్ సబ్ డివిజన్ పరిదిలో చేపట్టిన తపాలా ఖాతా అవగాహన సదస్సులు గురువారం లంకపల్లి గ్రామంలో సత్తుపల్లి పోస్టల్ ఇన్స్పెక్టర్ కోరే ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. లంకపల్లి గ్రామంతో పాటు గొల్లగుడెం, గు రవాయిగుడెం, శ్రీనివాసపురం, కొత్త లంకపల్లి గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. తపాలా శాఖలో అమలులో ఉన్న వివిధ రకాల పథకాలు, సేవల గురించి కోరే ప్రవీణ్ కుమార్ వివరించారు. వీటితోపాటు ఇన్సూరెన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అందించే వివిధ రకాల సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా తపాలా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సంవత్సరానికి 399/- రూపాయలతో పది లక్షల ప్రమాద జీవిత భీమా గురించి వివరించారు. గ్రామంలోని ప్రజలందరూ పోస్ట్ ఆఫీస్ కి రావడం అలవాటుగా చేసుకోవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పథకంలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తో పాటు మెయిల్ ఓవర్సీర్స్ కోటేశ్వర్ రావు, చంటి, బి పి ఎం లు గౌస్ పాషా లతో పాటు పెనుబల్లి లోని ఇతర సిబ్బంది నరసింహారావు, మహేష్, దినేష్, అషిక్, జయరాజు, వేణు, మారేష్ తదితరులు పాల్గొన్నారు.




