Thursday, 5 November 2026

ప్రతి ఇంట్లో సంక్షేమం.. ప్రతి మోమున సంతోషం..

.వరంగల్ బ్యూరో, జూన్ 09 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నేడు oజరిగిన తెలంగాణ సంక్షేమ దినోత్సవ కార్యక్రమం వరంగల్ గవిచర్ల రొడ్డు లోని జిఎం గార్డెన్స్ లో అట్టహాసంగా సాగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ , ఆర్డీవో మహేందర్జి కార్పొరేటర్ ముష్క మల్ల అరుణ సుధాకర్ కిల వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల జనార్ధన్, కార్పొరేటర్ కుమారస్వామి, భోగి సువర్ణ, కావటి కవిత, పల్లం రవి, కేడల పద్మ, వరంగల్ ఏసిపి బోనాల కిషన్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహారదీక్ష చేసి చావువరకు వెలికి తెలంగాణ తెచ్చారు కేసీఆర్యావత్తు తెలంగాను కేసీఆర్ ఒక్కతాటిపై తీసుకొచ్చి సకల జనులుసమ్మె లో అన్నిరంగాల ప్రజలు పాల్గొని తెలంగాణను సాదించుకున్నాం
67 కాంగ్రెస్,బీజేపీ వాళ్ళు పాలించారు కానీ ఆనాడుకేసీఆర్ ఇస్తున్న 2016 పెన్షన్ లేదు,గొర్రెల పంపిణీ,కళ్యాణాలక్ష్మి, షాధిముబారక్ లాంటి మరెన్నో పధకాలు నాటి పాలకులకు ప్రజలకు అందించడంచేతకాలేదు కనీసం ఆలోచన కూడా రాలేదుతెలంగాణ సర్కారు కేసీఆర్ అన్ని వర్గాలకు వారికి అండగా ఉంటున్నారుచేతి వృత్తులు చెనుకొనే 16కులాల వారికి లక్ష రూపాయలు అందించబోతుంది
సిఎంఆర్ఎఫ్ ద్వారా పెదలను గొప్పగా ఆదుకుంటున్నాంనియోజకవర్గంలో 2వేల ఇండ్లు నిర్మించాం అతి త్వరలో అర్హులైన పేదలకు అందిస్తాంగృహాలక్ష్మి,చేనేత,ఒంటరి మహిళ,రైతన్నలకు రైతు బంధు లాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను కేసీఆర్ పేద ప్రజలను అందిస్తున్న ఏకైక సర్కారుకేసీఆర్ సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు…నేడు ఈ వేదికపై 95 మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి షాధిముబారక్ చెక్కులు అందిస్తున్నాంకేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి లబ్ధిదారులు అందరూ ప్రజలు వివరించాలిపేద బిడ్డల పెళ్లిళ్లకు నా శక్తీ మేర ఎంతో కొంత సహాయం చేస్తున్న కానీ లక్ష రూపాయలు అందిస్తున్న మనసుగళ్ళ ముఖ్యమంత్రి మన కేసీఆర్కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశం కోరుకుంటుందితెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పనులు ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయ్ అంటే మన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వనా ఎంత గొప్పగా ముందుకుపోతుందో అర్థం చేసుకోవచ్చుమన రాష్ట్ర రైతుల గోస తీర్చి అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్ వెంట నడవాలని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారుతెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం 67 సంవత్సరాలు పాలించిన నాయకులకు ఎందుకు చేతకాలేదు ఇన్ని పధకాలు ఎందుకు ఇవ్వలేదు అట్లాంటోళ్లు మనకు ఎందుకు..?నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కు అన్యాయం జరిగిందినిధులు నియమాకాలు అన్ని ఆంధ్రల్లో దోచుకొని పోయిర్రుఅందుకే ప్రత్యేక రాష్ట్రం కోరుకుని సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకున్నాంపెదలను గొప్పగా ఎదిగే విదంగా చేసి ఓరుగల్లు ప్రజలు శభాష్ అనేలా చేస్తాంనియోజకవర్గంలో 39వేల మందికి పెన్షన్ అందిస్తున్నాం3800కోట్లతో నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నాంహాస్పిటల్, బస్ స్టేషన్, కలెక్టరేట్ తెచ్చుకున్నాం వాడవడన సిసి రోడ్లు ఎసినం గొప్పగా నియోజకవర్గాన్ని తీర్చిద్దుతున్నాం20వ తేదీలోపు కుల వృత్తులకు అందిస్తున్న ప్రోత్సాహకం కోసం అందరూ అప్లై చేసుకోవాలనిఆర్థికంగా ఆదుకుంటున్న గొప్ప ప్రభుత్వం తెలంగాణ సర్కారునాడు తెలంగాణ ఎట్లా ఉంది నేడు ఎట్లా ఉంది అనేది మనమందరం బేరీజు వేసుకోవాలి చర్చ జరపాలి90%శాతం నిరుపేదలకు ఉన్న తూర్పు నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాంరానున్న రోజుల్లో రింగ్ రోడ్డు చుట్టూ ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తాం.సంక్షేమంతో లక్షలాది కుటుంబాలు తెలంగాణలో బాగుపడ్డాయి చాలా సంతోషంగా ఉంది
ఇంత గొప్పగా అభివృద్ధి,సంక్షేమ పధకాలు అందిస్తున్న కేసీఆర్ గారిని కాపాడుకుందాంతదనంతరం
నియోజకవర్గానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి షాధిముబారక్ చెక్కుల పంపిణీ చేశారు
అదే వేదిక పక్కన ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంకు పాల్గొని పలువురు యాదవులకు గెర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.