;-ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే గ్రామాల్లో పర్యటన
;-చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం
;-వికారాబాద్ రూరల్ జూన్ 9 జనం సాక్షిచేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం గ్రామస్థాయిలో బి.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికే పల్లె పల్లెకు కె ఎస్ రత్నం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని మహమ్మదాన్ పల్లి, కుమ్మరిగూడ, గేటు వనంపల్లి, కడ్చర్ల గ్రామాలలో ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలైనా రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కెసిఆర్ కిట్టు, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కెసిఆర్ ను మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. గతంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే తరుణంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు సాగునీరు త్రాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కిందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం లో కుటుంబ పాలన కొనసాగుతుందని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నా వారసులు ఎవ్వరు రాజకీయాలలోకి రారని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ ఉద్యమకారులపై, పార్టీ నాయకులపై అక్రమ కేసులను బనాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లోబర్చుకోవాలని ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎమ్మెల్యే తీరు మారకుంటే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పేట్ మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ గౌస్, సునీతమ్మ యువసేన జిల్లా అధ్యక్షుడు అశోక్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ గోపాల్ ముదిరాజ్, ఫుల్ మామిడి ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, నర్సింలు, కావలి శేఖర్, శ్రీను, రాజేందర్, బషీర్, జైపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




