Tuesday, 3 November 2026

ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ పై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ పై అవగాహన కలిగి ఉండాలిశిక్షణ పై అవగాహన కలిగి ఉంటే అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు
-జిల్లా ఎస్పీ కె. సృజనఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 3 : ఎవరైనా యాక్సిడెంట్స్, హార్ట్ హటాక్, ఫిట్స్, పాము కాటు, కరెంట్ షాక్ కు గురైనప్పుడు యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ  పొందిన యెడల ఈ అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు అని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె. సృజన అన్నారు. సోమవారం మండల పరిధిలోని కోదండపురం గ్రామంలోని రైతు వేదిక  కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, రోడ్ సేఫ్టీ వింగ్ ఈయంరి గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఎవరికైనా హార్ట్ హటాక్ లేదా ఫిట్స్, పాము కాటు, కరెంట్ షాక్ కు వంటి అత్యవసర సమయాల్లో మొదటగా మనం చేయాల్సిన సపోర్ట్, ప్రథమ చికిత్స పై పోలీస్ సిబ్బందికి, హైవే అథారిటీ సిబ్బందికి, పెట్రోల్ బంకులలో పనిచేసే సిబ్బందికి, ఆటో, కార్, ఇతర వాహనాల డ్రైవర్లకు యక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె. సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడైనా, ఎప్పుడైనా యక్సిడెంట్ జరిగిన అత్యవసర సమయంలో ఏమి చేయాలో తోచని స్థితిలో ఉంటారని ఆగోల్డెన్ సమయంలో ప్రమాదాలకు గురైన వారిని కాపాడేందుకు యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సమచారం ఇస్తే సాక్షులుగా చేర్చి కోర్ట్ కు పిలుస్తారనో అపోహ ఉందని అది నిజం కాదని, రోడ్డు ప్రమాదం సమచారం ఇచ్చిన వారినీ మళ్ళీ ఎప్పుడు పిలవడం జరగదని ఈ విషయాన్నీ ప్రజలు గ్రహించాలన్నారు. జాతీయ రహదారి వెంబడి చాల గ్రామాలు ఉన్నాయని, ఆయ గ్రామాల నుండి జాతీయ రహదారి పై వెళ్ళే సమయంలో చిన్న చిన్నా పొరపాట్ల వల్ల యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తే ఆ కుటుంబంలో తీరని వేదన మిగలడంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. ప్రమాదాలను నియంత్రించేదుకు ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రమాదకరమైన రహదారులను, డేంజర్‌ స్పాట్లను, గుర్తించడంతో పాటు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే రహదారులలో వాటిని నివారణ కోసం రక్షణ చర్యలు ఏర్పాటు చేసామని ఎస్పీ తెలిపారు. ప్రమాదాలకు గురైన వెంటనే గాయపడ్డ వారికి మానసిక ధైర్యం కల్పించడం కోసం మనం సపోర్ట్ గా వుంటూ ఫ్రథమ చికిత్స అందించి అంబులెన్స్ కు సమాచారం అందించాలని అన్నారు. శిక్షణను అందించడం ద్వార ఎన్నో ప్రాణాలను కాపాడిన వారవుతారన్నారు. అనంతరం రోడ్డు సేప్టీ వింగ్ డిఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగిన సమయంలో సదరు వ్యక్తికి మనం ఇచ్చే ధైర్యం ఎంతో ముఖ్యమని, యాక్సిడెంట్ జరిగిన వారికి ప్రథమ చికిత్స అందించకుండా పోటోలు తీసుకోవడం చాలా భధాకరమైన విషయమన్నారు. గద్వాల డీఎస్పీ రంగస్వామి మాట్లాడుతూ ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు 108, పోలీస్ వారిది మాత్రమే బాధ్యత అని కాకుండా ప్రతి ఒక్క పౌరుడు గాయపడిన వ్యక్తులను రక్షించడంలో భాగస్వామ్యం కావాలన్నారు.అలాగే ఈయంరి హెల్త్ సర్వీస్ నుండి వచ్చిన డాక్టర్ సతీష్ యాక్సిండెట్ జరిగిన సమయంలో ఎలాంటి చికిత్స అందించి క్షతగాత్రులను కాపాడాలో వివరించడం జరిగింది. ఈకార్యక్రమంలో డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,  శాంతినగర్ సీఐ శివ శంకర్, గద్వాల్ సిఐ చంద్రశేఖర్, కోదండపురం, మనోపాడ్, ఉండవల్లి ఎస్సైలు వెంకట స్వామి, సంతోష్, బాలరాజు, పోలీస్ సిబ్బంది తోపాటు ఆయా శాఖల అధికారులు, వాహనాలు నడిపే డ్రైవర్లు పాల్గొన్నారు.