హుజూర్ నగర్ మే 27 (జనంసాక్షి):ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని హుజూర్ నగర్
శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 11వ వార్డులో బిఆర్ఎస్ నాయకులు జూలకంటి నర్సిరెడ్డి ఇంటికి వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకోని పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని కలిగించడం జరిగింది. శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి నియోజక వర్గమంతా క్షణం కూడా తీరికలేకుండా ప్రజల మేలుకొరకు ఎర్రటి ఎండను సహితం లెక్కచేయకుండా సుడిగాలి పర్యాటనలు చేస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే గొప్ప నేత అని, ఇలాంటి ప్రేమ- ఆప్యాయతలు కార్యకర్తలపై చూపించడం మరెవరివల్ల కాదన్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో సైదిరెడ్డి గెలుపు కొరకు అహర్నిశలు ప్రజల్లో ఉంటూ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ , సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు, కౌన్సిలర్లు కే. ఎల్. ఎన్ రావు, యారగాని గురవయ్య, గుండా ఫణి రామ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్, వార్డు ఇంచార్జ్ మీసాల శరత్, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, నాయకులు నాతల మోహన్ రెడ్డి, చింత్రియాలా నాగయ్య, మేరీగ గురవయ్య, లక్కం వెంకన్న, యువజన నాయకులు మేరిగ సాయి, పచ్చిపాల మైసయ్య, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.




