Wednesday, 4 November 2026

ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం  2014 తర్వాత గ్రామపంచాయతీల అభివృద్ధి  టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 15 :- దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ కంది మండలంలోని పలు గ్రామాలు పర్యటించారు.  ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆయన శంఖస్థాపనలు చేశారు.కంది మండలంలోని  చిమ్నపూర్ , ఏర్ధనుర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఏర్ధనుర్ గ్రామంలో సీఎం ప్రత్యేక నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన ఆరోగ్యం సైతం లెక్కచేయకుండా ప్రతి గ్రామాలు తిరిగి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న చింతా ప్రభాకర్ కు ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతుప్రతి గ్రామంలో పండగ వాతావరణం లో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని 2014 కంటే ముందు ఏముండే ఇప్పుడు ఏముంది అనేదానిపై చర్చ జరుగుతుంది వివరించారు.కేసిఆర్ ఎది ఆచరిస్తే దేశం అది అనుచరిస్తుందన్నారు.ప్రతి పల్లెలో ట్రాక్టర్ ,ట్రాలీ ట్యాంకర్ ,పల్లేపకృతి వణం , క్రీడా ప్రాంగణం ,గతంలో ఇవేవీ ఉండేవి కాదని కెసిఆర్ నాయకత్వంలో దేశంలోని అన్ని గ్రామ పంచాయతీ లకంటే మాన గ్రామపంచాయతీలకు వార్డులు దీనికి నిదర్శం అని కొనియాడారు.అభివృద్ధి , సంక్షేమం సమపాలనలో జరుపుతూ  దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయిలో కేసిఆర్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, వైస్ చైర్మన్ కాజా ఖాన్, జడ్పిటిసి కొండల్ రెడ్డి , ఎంపీపీ సరళ పుల్లారెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్ , వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు ,ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.