జనంసాక్షి జూన్ 15 (భువనగిరి రూరల్ )నేడు గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉన్నాయంటే దానికి సఫాయి కార్మికులే ప్రధాన కారణమని సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి నర్సరీ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామాలను సందర్శించడం జరిగింది. ర్యాలీ అనంతరం సర్పంచ్ కవిత రాఘవేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ…పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే నేడు గ్రామాలు పచ్చదనం,పరిశుభ్రతతో వర్ధిల్లుతున్నాయని అన్నారు.విరిగిపోయిన, వంగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త ఫోల్ లను ఏర్పాటు చేయడం, లూజు లైన్లను సరి చేయడం, రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటడం ప్రతిరోజు చెత్తను సేకరించడం లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ప్రకృతి వనాన్ని నిర్మించడం, డంపింగ్ యార్డ్ నిర్మించడం, స్మశాన వాటిక నిర్మించడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీకి సొంతంగా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకరు కొనుగోలు చేయడం వల్ల ఎన్నో సౌకర్యాలు సమకూర్తున్నాయని పేర్కొన్నారు. ఏప్పటికప్పుడు రోడ్లను, మురికి కాలువలను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. మహిళలు తమ ఇండ్లలోని చెత్తను తడి చెత్తగా, పొడి చెత్తగా వేరుచేసి సఫాయిలకు అందించాలని కోరారు.నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం వల్లే గ్రామాలు, మండలాలు, జిల్లాలు అభివృద్ధి పథంలో వెళుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్లే నేడు సాగునీరు, తాగునీరు రైతులకు 24 గంటల విద్యుత్తు, తో పాటు రైతుబంధు,రైతు బీమా అందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్లో సుమారు 45 వేల కోట్లను ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్లే నేడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోని మహారాష్ట్ర ,కర్ణాటక, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలోని పథకాలను తమకు ప్రవేశపెట్టాలని ఆయా ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. మన గ్రామం కొత్త గ్రామపంచాయతీ గా ఏర్పడిన నుండి అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రజలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం సపాయి కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్షేక్ సాహెబి పంచాయతీ కార్యదర్శి పద్మా రెడ్డి ,ప్రధానోపాధ్యాయులు రాములు , స్పెషల్ అధికారి ,సింగల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి వార్డు సభ్యులు ,, కోఆప్షన్ సభ్యులు, అంగన్వాడిటీచర్ వివో ఏ , ఆశ వర్కర్ ,గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సఫాయన్న.. సలామ్ అన్న.. -సర్పంచ్ జక్క కవితరాఘవేందర్రెడ్డి ఘనంగా పల్లె ప్రగతి




