హైదరాబాద్:ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ వల్ల పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు వేసింది. రాత్రి 10 గంటలకు కాకినాడ-విజయవాడ ప్రత్యేక రైలు, రేపు రాత్రి 7గంటలకు తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైలు, ఈ నెల 11న ఉదయం 11 గంటలకు కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైలు, ఈనెల 10, 13న మధ్యాహ్నం 2:30కు విజయవాడ-తిరుపతి ప్రత్యేక రైలు, ఈ నెల 11న ఉదయం 11.05 గంటలకు తిరుపతి విశాఖ ప్రత్యేక రైలు, ఈ నెల 12న ఉదయం 11.15 గంటలకు విశాఖ-విజయవాడ ప్రత్యేక రైలు, ఈ నెల 14న ఉదయం 11.05 గంటలకు తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు, ఈ నెల 15న ఉదయం 11.15గంటలకు విశాఖ-విజయవాడ ప్రత్యేక రైలు, కాచిగూడ-విజయవాడ మధ్య 2ఏసీ డబుల్‌డెక్కర్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈ డబుల్‌డెక్కర్ రైలు ఈ నెల 11న ఉదయం 6:45 కు కాచిగూడ నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. ఈ నెల 11న మధ్యాహ్నం 2:45కు విజయవాడ-కాచిగూడ ఏసీ డబుల్‌డెక్కర్ బయలుదేరుతుంది.




