Thursday, 5 November 2026

ప్రత్యేక హోదాపై పోరాడతానన్న పవన్‌.. 

పత్తాలేకుండా పోయాడు
– ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
– పవన్‌పై ఫైర్‌ అయిన మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
విశాఖపట్నం, జులై10(జ‌నం సాక్షి ) : ప్రత్యేక ¬దాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగతానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ పత్తా లేకుండా పోయాడని మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగార్‌  పవన్‌కు ఆయన 25 ప్రశ్నలను సంధించారు. పవన్‌ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. ప్రత్యేక ¬దాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్‌ పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్‌ ఫ్యాక్ట్‌ పైండింగ్‌ కమిటీ నివేదిక
ఇస్తే.. దానివిూద పన్‌ నోరు మెదపడం లేదని, కేంద్రంపై పల్లెత్తు మాట అనే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. విూ రాజకీయ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి, విూ పొత్తు ఎవరితో అని పవన్‌ను ప్రశ్నించారు. ‘గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి విూరు సాయం చేశారని, దానిని అంగీకరిస్తున్నామని, కానీ విూరు లేనప్పుడు కూడా టీడీపీ గెలిచిందని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. కేవలం రాజకీయం పబ్బం గడుపుకోవటానికే చంద్రబాబు, లోకేష్‌లపై పవన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలను బహిర్గతం చేయాలని లోకేష్‌ కోరుతున్నా పవన్‌కు ఆ దమ్ము లేదని, అసలు అవినీతికి పాల్పడితే కదా పవన్‌ వద్ద ఆధారాలు ఉండటానికి అని పేర్కొన్నారు. పవన్‌ కేవలం అసత్య ఆరోపణలతో రాజకీయాలు చేయాలని, తద్వారా ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని గంటా విమర్శించారు. ప్రజలు నీవు అనుకున్నంత తెలివితక్కువ వాళ్లు కాదని, ఎవరు నిజాలు చెబుతున్నారని, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారన్న విషయాలు తెలుసుకుంటూనే ఉంటారన్నారు. బీజేపీని పవన్‌, జగన్‌లు ఎందుకు విమర్శించలేక పోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కేవలం బీజేపీ, జగన్‌లు ఇచ్చిన స్టిప్ట్ర్‌ లనే పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లోకి వెళ్లి చదువుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి చేష్టలు ఇప్పటికైన మానుకోవాలని, అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు.