Wednesday, 4 November 2026

ప్రధానమంత్రి పరీక్షాపే చర్చ కార్యక్రమాన్ని ఆలకించిన ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు

 

 

 

 

 

జనం సాక్షి, చెన్నరావు పేటపరీక్షల కారణంగా విద్యార్థుల్లో ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమమే పరిక్షా పే చర్చ .ఈ కార్యక్రమానికి దేశం మొత్తంలో 81,315 మంది విద్యార్థులు, 11,868 మంది ఉపాధ్యాయులు, 5,496 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షల్లో ఒత్తిడిని ,ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు దిశా నిర్దేశనం చేశారు.

ప్రతి బంతికీ బౌండరీ.. ఎవరికీ సాధ్యం కాదు: మోదీ

విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని.. అలా రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.చిన్నారులకు గెలుపోటములను సమానంగా తీసుకోవడం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.ఈ సందర్భంగా చిన్నారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.‘జీవితంలో సమయపాలన అనేది చాలా కీలకం. పిల్లలపై చదువుకోవాలనే ఒత్తిడి పెంచొద్దు. క్రికెట్‌లో ప్రతి బంతిని ఫోర్‌, సిక్స్‌ కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఉత్సాహపరచడం వల్ల పిల్లలు మరింత బాగా చదువుతారు’’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో 186 మంది విద్యార్థులు కార్యక్రమాన్ని ఆలకించారు.