Wednesday, 4 November 2026

ప్రపంచం మృత్తిక ( నేల) దినోత్సవం

ప్రపంచం మృత్తిక ( నేల) దినోత్సవం
వనపర్తి బ్యూరో : డిసెంబర్ 5 ( జనం సాక్షి )
రసాయనిక ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులను ఉపయోగించి భూసారాన్ని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
సోమవారం “ప్రపంచ మృతిక (నేల) దినోత్సవం” సందర్భంగా నాగవరం గ్రామ పంచాయతీలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,భూసారాన్ని పెంచడానికి రైతులు సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలు సాగు చేయాలని ఆయన అన్నారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారం నానాటికి తగ్గిపోతున్నదని, 100 ఏళ్ల క్రితం క్రిమిసంహారక మందులు వాడకం తక్కువగా ఉండేవని ఆయన తెలిపారు. భూసార పరీక్షలలో డి గ్రేడ్ వస్తే పంటలు పండడం కష్టమని ఆయన అన్నారు. 1965 సం. లో గోధుమ పంట వచ్చిందని, 142 కోట్ల జనాభాను, భూ మాతను మనం రక్షించుకోవాలని ఆయన అన్నారు. భూమికి ఎంత యూరియా అవసరమో అంతే వాడాలని, మోతాదుకు మించి వాడ రాదని ఆయన అన్నారు.
వనపర్తి జిల్లాలో వరి, వేరుశనగ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాకు వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ పంటలు పండించడం వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి తెలిపారు.
అనంతరం రైతులకు డ్రం సీడర్లు పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ భూ సారాన్ని పెంచాలని, సేంద్రియ ఎరువులు వాడాలని ఆమె అన్నారు. ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూ సారం తగ్గిపోతుందని ఆమె అన్నారు. యూరియా ఎక్కువగా వాడటం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోతుందని ఆమె సూచించారు.
శాస్త్రవేత్తలు శ్రీధర్ మాట్లాడుతూ రైతులు దేశాన్ని రక్షించాలని, మట్టి పరీక్షలు నిర్వహించి ఏ పంటకు ఏ ఎరువులు వేయాలో వ్యవసాయ అధికారుల ద్వారా తగు సూచనలు పాటించాలని ఆయన అన్నారు.
శాస్త్రవేత్త శంకర్ మాట్లాడుతూ భూమిలోని మట్టిని 16 రకాలుగా పరీక్షలు నిర్వహిస్తారని, పరీక్ష నిర్వహించిన అనంతరం వచ్చే ఫలితాలను రైతులు తెలుసుకొని వ్యవసాయం చేయాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ జగదీష్ రెడ్డి, కురుమూర్తి, మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఉద్యాన శాఖ అధికారులు, జయసుధ, విజయ్, ఎంపీటీసీ సర్పంచులు సింగిల్ విండో చైర్మన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.