Wednesday, 4 November 2026

సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామపంచాయతీ నిధులను

సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు
బోయిన్ పల్లి డిసెంబర్ 05 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తాడగొండ గ్రామా పంచాయితీ లో జరుగుతున్న అవినీతి , నిధుల దుర్వినియోగం పై తాడగొండ గ్రామా సర్పంచ్ చిందం రమేష్ , ఉప సర్పంచ్ చేపురి వరలక్ష్మి అవినీతికి పాల్పడుతూ గ్రామా ప్రజలకు చెందాల్సిన నిధులు పక్క దారి పట్టిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు స్థానిక గ్రామపంచాయతీ నాలుగో అవార్డు సభ్యుడు గుడి రవీందర్ రెడ్డి తెలిపారు. గ్రామా సర్పంచ్ చిందం రమేష్ ఉప సర్పంచ్ చేపురి వరలక్ష్మి పై సమగ్ర విచారణ జరిపి పక్క దారి పట్టిన గ్రామా పంచాయితీలోని నిధులను రికవర్ చేసి సర్పంచ్ , ఉప సర్పంచ్ లపై కటిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.