..
– భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి.ఊరుకొండ, జనవరి 26 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారిపై గల భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి.. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సముచిత గౌరవం దక్కాలని ఊరుకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గువ్వ వరప్రసాద్ మరియు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడు అలీమ్ లు పూల మాలలతో సత్కరించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, ఉపాధ్యక్షులు జంగయ్య, సభ్యులు సందీప్, గుమ్మడయ్య భాస్కర్, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు సిద్దు, శ్రీకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు.




