Wednesday, 4 November 2026

జాతీయ జెండాకు కష్టాలు

 

 

 

 

 

 

 

 

డోర్నకల్ జనవరి 26 జనం సాక్షిజాతీయ జెండాకు కష్టం వచ్చిన సంఘటన డోర్నకల్ మండల రెవిన్యూ కార్యాలయంలో చోటుచేసుకుంది.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి రెవిన్యూ అధికారులు అలాంటి హడావుడి ఏమీ లేకుండా తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేయడం మూలంగా జాతీయ జెండాకు అవమానం జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.గురువారం రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఎమ్మార్వో స్వాతి బిందు జాతీయ జెండాను పైకి లాగిన క్రమంలో ఎంతకు ఎగరకపోవడంతో మరల కిందికి దించి జెండాకు కట్టిన తాడును (ముడిని) పూర్తిగా ఊడదీసి జాతీయ జెండాను పైకి లాగి గౌరవ వందనం చేశారు.రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండాకు కష్టం వచ్చిందని ప్రజలు అంటున్నారు.