హైదరాబాద్ : విద్యుత్ భార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాద్లో వెల్లడించారు. మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం బాధకరమే అని ఆయన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచించారు.




