Tuesday, 3 November 2026

ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర  ప్రభుత్వం కృషి

పెన్ పహాడ్ జూన్ 01 (జనం సాక్షి) : మన ఊరు మన బడి కార్యక్రమంలో బాగాంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎస్ఎంసి చైర్మన్ రణపంగ నర్సయ్య అన్నారు, గురువారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల రూపురేఖలు మారి ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూల్గా దర్శనామిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రాములు, మాజీ ఎంపీపీ నల్లపు రామానుజమ్మ శ్రీనివాస్,రణపంగ దుర్గయ్య, మాజీ సర్పంచ్ రణపంగా గురువమ్మ దుర్గయ్య, కొన్నే అరవిందు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, గోవిందు, అంగన్వాడి టీచర్లు వసంత, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు…