Tuesday, 3 November 2026

ప్రభుత్వమే రెచ్చగొడుతోంది : జూపల్లి

హైదరాబాద్‌: ఈనెల 24న సడక్‌ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామంటే ప్రభుత్వమే రెచ్చగొడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సడక్‌ బంద్‌ నేపథ్యంలో బైండోవర్లు, అక్రమ అరెస్ట్‌లను నిలిపివేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ప్రజాస్వామ్య బద్ధంగానే దీక్ష కొనసాగుతోందని, అయినా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని వారు ఈ సందర్భంగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని జూపల్లి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *