హైదరాబాద్: సడక్ బంద్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. సడక్ బంద్‌కు ప్రతి 10 కిలోమీటర్‌కు ఒక ఎమ్మెల్యేను ఇంఛార్జిగా నియమించామని ఆయన తెలిపారు. సడక్ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అణిచివేయాలని చూస్తే సర్కారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని హెచ్చరించారు. అనుకోనిది జరిగితే తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలిస ఉంటుందని తెలిపారు.




