Thursday, 5 November 2026

ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ చేసుకోవాలి డాక్టర్ ప్రణవ

ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ చేసుకోవాలి డాక్టర్ ప్రణవ
మెండోరా నవంబర్ 11( నిజంసాక్షి ) నిజాంబాద్ జిల్లా మెండోర మండల కేంద్రం లొ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రణవ మెండోరా మండల కేంద్రంలోని ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని సౌకర్యాలు పరికరాలు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ప్రయత్నం చేసుకోవాలి నార్మల్ డెలివరీ సేఫ్ గా ఉంటుంది దీనివలన మదర్ మరియు బేబీ సేఫ్ గా ఉంటుందని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటామని అని అన్నారు ప్రతిరోజు గ్రామలలో ఇంటింటికి ఆశ వర్కర్ మరియు ANM,సూపర్వైజర్లు తిరుగుతూ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకొని రికార్డు చేయడం జరుగుతుంది చిన్న జ్వరం వచ్చిన ఏ సమస్య ఉన్న హాస్పిటల్ కి తెల్ల రేషన్ కార్డు తీసుకువచ్చి చూయించుకోవాలని OP కేసులు కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది కావున ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు ప్రతి గురువారం అమ్మ ఒడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి గర్భిణీ మహిళ నార్మల్ డెలివరీ కి ప్రయత్నం చేయాలని ఆమె కోరడం జరిగింది