[7:28 pm, 10/11/2022] +91 88864 64850: ఎంపీ నామా నిధులతో మందలపల్లి కి సీసీ రోడ్ లు
**************
నవంబర్ 10 (జనం సాక్షి): ఖమ్మం పార్లమెంట్ సభ్యులు ఎంపీ నామా నాగేశ్వరరావు నిధుల నుంచి మందలపల్లి కి పది లక్షల విలువైన రెండు రోడ్ లు మంజూరు చేయగా ఈ రోజు అంబేద్కర్ కాలనీ కి వెళ్ళే రోడ్ కు శంకుస్థాపన చేసి పొయ్యడం జరిగింది. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా కాలనీ లోకి వెళ్ళడానికి సరైన మార్గం లేక ఇబ్బందిపడుతున్న కాలని వాసులకు శాశ్వత పరిష్కారం చూపిన ఎంపీ నామా కు కాలనీ వాసులంతా కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్ ల మంజూరు కొరకు అహర్నిశం శ్రమించిన దిశ కమిటీ సభ్యుడు, ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ ను ప్రత్యేకంగా అభినందించారు. దిశ కమిటీ సభ్యుడు గారపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుంచీ ఇబ్బంది పడుతున్న హై స్కూల్ రోడ్ కు ఉపాధి హామీ పథకం ద్వారా 9 లక్షలు ఇప్పుడు ఎంపీ నిధులనుంచి 10 లక్షలు మంజూరు చేయించిన పేదల మనిషి ఎంపీ నామా కు గ్రామస్తులు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు, త్వరలో రోడ్ ల ప్రారంభోత్సవం ఎంపీ నామా తో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సర్పంచ్ మదివి దుర్గ, ఎంపీటీసీ దేవరపల్లి అజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వర రావు ఉపసర్పంచ్ సూర్యనారాయణ లను గ్రామస్థులు శాలువా తో సత్కరించారు. కార్యక్రమం లో కార్యదర్శి వెంకటేశ్వర్లు, కనపర్తి ధర్మారావు, గంజి రామారావు, దార వెంకటేశ్వరరావు, భాగ్యరాజు, మద్దెల పుల్లారావు, చిన్నబాబు, రాజా, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
[7:37 pm, 10/11/2022] +91 98485 12355: తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ లో జిల్లా వాసులకు చోటు.. రాష్ట్ర కార్యదర్శిగా ఎడ్ల రమేష్ ఎన్నిక
కరీంనగర్ టౌన్ నవంబర్ 10(జనం సాక్షి)
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కి చెందిన ఎడ్ల రమేష్ రాష్ట్ర కార్యదర్శిగా నవంబర్ 8, 9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 3వ మహాసభల్లో ఎన్నికయ్యారు.
*తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ మూడవ రాష్ట్ర మహాసభలు నవంబర్ 8 9 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగాయి మహాసభలో భవన నిర్మాణ కార్మిక సమస్యలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మహాసభలు చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది సదనంతరం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది.కరీంనగర్ నుండి ఎడ్ల రమేష్ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కధిరే రమేష్, గెర రాజకుమారి రాష్ట్ర క…




